కలం, తెలంగాణ బ్యూరో : ప్రతిపక్ష సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల సభ్యులు నోటీసులు (No Confidence Motion) ఇచ్చారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేసిన నోటీసులో పలు వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ తదితర పలు ఇండియా కూటమి పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సైతం అందజేశారు. ఇదే విషయాన్ని మీడియాకు సైతం ఆ ఎంపీలు వివరించారు. సెక్రటరీ జనరల్‌కు ఇచ్చిన నోటీసుకు ఫిబ్రవరి 10న మొత్తం 118 మంది ఎంపీలు సంతకాలు చేసిన కాపీని కూడా జతపరిచారు. ఇంతదాకా బాగనే ఉంది.. కానీ అసలు తిరకాసు ఆ నోటీసులోనే ఉన్నది.
నోటీసులో పై భాగంలో 10 ఫిబ్రవరి, 2026 అని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లలో స్పీకర్‌పై అవిశ్వాసాన్ని (No Confidence Motion) వ్యక్తం చేయడానికి దారితీసిన కారణాలను పేర్కొన్నారు. ఈ నాలుగు కారణాల్లోనూ తేదీని తప్పుగా పేర్కొన్నారు. 2, 3, 4, 5 తేదీల్లో జరిగిన పరిణామాలను ఉటంకిస్తున్న దగ్గర 2 ఫిబ్రవరి 2025, 3 ఫిబ్రవరి 2025, 4 ఫిబ్రవరి 2025, 5 ఫిబ్రవరి 2025 అని పేర్కొన్నారు. దీంతో గతేడాది జరిగిన ఘటన అనుకునే అవకాశమున్నది. స్పీకర్‌పై నిర్దిష్టంగా కారణాలను వివరించే దగ్గర సంవత్సరాన్ని 2026కు బదులుగా 2025 అని పేర్కొనడం విమర్శలకు దారితీసింది. సెక్రటరీ జనరల్ ఈ పొరపాటుపై ఏ విధంగా స్పందిస్తారన్నది గమనార్హం. నోటీసులో పేర్కొన్న తేదీ ప్రకారం వీడియో ఫుటేజీ తీసి ఎంక్వయిరీ జరిపిన పక్షంలో నాలుగు అంశాలుగా పేర్కొన్నవాటిలో ఈ సీన్ కనబడే అవకాశం లేదు. ఇంత కీలకమైన అంశంలో మొత్తం 118 మంది ఎంపీలు పొరపాటు చేయడం చర్చనీయాంశం. ఇంత బుర్ర పెట్టకుండా నోటీసు తయారుచేస్తారా అనే మాటలూ వినిపించాయి. ఆలస్యంగా పొరపాటును గ్రహించిన విపక్ష ఎంపీలు 2025 సంవత్సరానికి బదులు 2026 అని సవరించి మరో నోటీసును సెక్రటరీ జనరల్‌కు ఇచ్చారు.
Read Also: ఓం బిర్లా పై అవిశ్వాస బాంబు.. చరిత్ర ఏం చెబుతోంది?
Follow Us On : WhatsApp



