కలం, వెబ్ డెస్క్: అత్యంత పవిత్రమైన అయోధ్య శ్రీ రామ మందిరానికి (Ayodhya Temple) కోట్లాది మంది సమర్పించిన విరాళాలు, కానుకల్లో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ స్పందించింది. వీటిపై సమగ్ర విచారణ జరపాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసింది. స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని కోరింది. రామ మందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాల్లో కోట్ల రూపాయలు గల్లంతయ్యాయంటూ ఇటీవల సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. విరాళాల లెక్కింపుల్లో గోల్ మాల్ జరిగిందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను అప్పుడే ఖండించిన ఆలయ ట్రస్ట్.. తాజాగా దర్యాప్తు చేయాలని సీఎంకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ట్రస్ట్ కార్యదర్శి ఏమంటున్నారంటే..
శ్రీ రామ మందిర (Ayodhya Temple) నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే అంశాలను కొట్టిపారేశారు. ఆలయానికి సంబంధించిన ప్రతీ ఆర్థిక లావాదేవీని ట్రస్ట్ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు క్రమం తప్పకుం డా ఆడిట్లు చేస్తున్నారని, ఎలాంటి అవకతవకలు బయటపడలేదని ఇటీవల పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినట్లుగా జాతీయ మీడియా కథనాలు చెబుతుండగా.. ఇంతవరకు అధికారికంగా మాత్రం బయటకు ఎలాంటి ప్రకటనలు రాలేదు.
Read Also: నా సోదరుడు గుర్తొచ్చాడు.. డీజీపీ సీవీ ఆనంద్ భావోద్వేగం
Follow Us On: X(Twitter)

