యాదాద్రిలో అవని శృంగేరి జగద్గురు శంకరాచార్య స్వామి పూజ‌లు

కలం, యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సోమవారం శ్రీశ్రీశ్రీ అవని శృంగేరి జగద్గురు శంకరాచార్య (Jagadguru Shankaracharya) అవని శృంగేరి మఠం స్వామి దర్శించుకున్నారు. స్వామికి ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ ఈవో భవాని శంకర్ స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వయంభు నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్ర చార్యులు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్పటిక లింగానికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాలయం ప్రధాన అర్చకులు నరసింహ రామ శర్మ, డీఈవో నవీన్ కుమార్, సూపరిండెంట్ రాజన్ బాబు తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>