అన‌సూయ‌పై అస‌భ్య‌క‌ర కామెంట్స్.. యువ‌కుడి అరెస్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ సెల‌బ్రెటీల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌చ్చే వేధింపుల‌పై పోలీసులు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. చిన్న చిన్న యాంక‌ర్ల నుంచి మొద‌లుకొని పెద్ద హీరోయిన్ల వ‌ర‌కు అంద‌రికీ ఆక‌తాయిలు సోష‌ల్ మీడియాలో అస‌భ్య ప‌ద‌జాలంతో కామెంట్లు చేయ‌డం, వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి విమ‌ర్శించ‌డం త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంటోంది. దీనిపై యాంక‌ర్ ర‌ష్మి, అన‌సూయ‌, సింగ‌ర్ చిన్మ‌యి, న‌టి రేణు దేశాయ్‌ మొద‌లుకొని మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి వ‌ర‌కు అంతా పోలీస్ స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తాజాగా యాంక‌ర్ అన‌సూయ‌ (Anchor Anasuya)పై అస‌భ్య కామెంట్స్ పెడుతున్న ఓ యువ‌కుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ అరుణ్ కుమార్ అన‌సూయ‌పై అస‌భ్య‌క‌ర కామెంట్స్ పెడుతూ, ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నాడు. దీనిపై అన‌సూయ సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచార‌ణ చేప‌ట్టి అరుణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>