Mobile Popup Ad
Mobile Popup Ad

రేపట్నుంచే పదో తరగతి పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి (SSC Exams) వార్షిక పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా, 10,512 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో బాలురు 2,67,954 మంది, బాలికలు 2,60,285 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, ప్రైవేట్ నుంచి 2,50,015 మంది, అలాగే గురుకుల పాఠశాలల నుంచి 60,139 మంది విద్యార్థులు (Students) పరీక్షలకు హాజరుకానున్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,674 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>