కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలో ఓ ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవి రోడ్డు ప్రాంతంలో అర్ధరాత్రి ఓ దుండగుడు ఏటీఎంలోకి చొరబడి చోరీకి ప్రయత్నించాడు (ATM Theft Attempt). నిందితుడు ఏటీఎం తలుపును బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఏటీఎం అలారం మోగడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒకటవ టౌన్ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు.

