కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని (Hyderabad) ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. ఏటీఎంలలో (ATM) నగదు నింపే ఒక వ్యాన్ (ATM Cash Van) డ్రైవర్ ట్రంక్ బాక్స్ నుంచి ఏకంగా రూ.17 లక్షల నగదును అపహరించి పరారయ్యాడు. రాయింబజార్ – సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సదరు డ్రైవర్ ముందస్తు ప్రణాళికతోనే సిద్ధం చేసుకున్న ద్విచక్ర వాహనంపై నగదుతో సహా పారిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ దోపిడీపై ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
ఘటనా స్థలంలో లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పట్టపగలే జరిగిన ఈ దోపిడీ ఘటన ఏటీఎంల నగదు రవాణా భద్రతపై, ప్రైవేట్ ఏజెన్సీల సిబ్బంది పనితీరు ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Also: ఇండియా ఇష్టం లేదు.. డబ్బులొస్తే వెళ్లిపోతా: కాక్రోచ్ పార్టీ క్యాంపైనర్
Follow Us On: Instagram

