కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు (Assembly Election Results 2026) సంబంధించింది కౌంటింగ్ మొదలయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం తో సహా కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి లో ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల కౌంటింగ్ మొదలు పెడతారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్ లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగి ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్లను కూడా లెక్కిస్తున్నారు.
కాగా, ఫలితాలకు ముందే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రిజల్ట్స్ పై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బెంగాల్ లో బీజేపీ, టీఎంసీకి మధ్య టఫ్ పోటీ ఉంటుందని, హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ ఫలితాల్లో అంచనాలు వెల్లడయ్యాయి. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు, టీవీకే అధినేత దళపతి విజయ్ అధికారం చేపట్టే ఛాన్స్ ఉందనే అంచనాలు ఉన్నాయి. అలాగే, డీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చనే మెజారిటీ సర్వే సంస్థలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో బెంగాల్ లో దీదీ గెలుపు, తమిళనాడులో విజయ్ సత్తాపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

