Mobile Popup Ad
Mobile Popup Ad

కూలర్ వల్ల మీ గది జిగటగా మారుతోందా? ఈ చిన్న చిట్కాతో చెక్ పెట్టండి

కలం, వెబ్‌డెస్క్: వేసవి కాలంలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు మనం ఇళ్లలో కూలర్లు, ఏసీలు ఉపయోగిస్తుంటాం. ఎండల నుంచి ఉపశమనం కోసం రోజంతా కూలర్లు (Cooler), ఏసీ (AC) లను నడిపిస్తూనే ఉంటాం. దీనివల్ల గదిలో తేమ పెరిగి జిగటగా, తడిగా అనిపిస్తుంది. గదిలో బరువైన వాతావరణం, దుర్వాసన, గోడలు లేదా బట్టలపై తడి ఏర్పడటం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి.

అయితే ఎందుకు ఇలా అవుతుందో తెలుసుకుందాం. కూలర్లు గాలిని చల్లబరచడానికి నీటిని ఉపయోగిస్తాయి. అందువల్ల గదిలో తేమ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా గదిని పూర్తిగా మూసివేసి, వెంటిలేషన్ లేకపోతే ఈ తేమ మరింత ఎక్కువగా ఉంటే ఈ సమస్య కలుగుతుంది. కూలర్ నడుస్తున్న సమయంలో దుప్పట్లు, దిండ్లు లేదా బట్టలు తడిగా అనిపించడానికి కూడా ఇదే కారణం.

ఉప్పుతో చెక్ పెట్టండి..!

ఈ సమస్యకు ఖరీదైన వస్తువులను కొనాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే చాలా సులభంగా అందుబాటులో ఉండే ఉప్పుతో ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు. ఉప్పుకు గాలిలోని తేమను పీల్చుకునే ప్రత్యేక గుణం ఉంటుంది. శాస్త్రీయంగా దీనిని “హైగ్రోస్కోపిక్” లక్షణం అంటారు. అంటే గాలిలోని అదనపు తేమను ఉప్పు తనలోకి ఆకర్షిస్తుంది. గదిలో ఒక గిన్నెలో ఉప్పును ఉంచితే, అది క్రమంగా గాలిలోని తేమను పీల్చుకుని గదిని కొంత పొడిగా ఉంచడంలో సహాయపడుతుంది.

కొంతసేపటి తర్వాత ఉప్పుగా తడి మారడం గమనించవచ్చు. ఇది గదిలోని తేమను అది గ్రహిస్తోందని సంకేతం. దీనితో గదిలో ఉంటే బూజు వాసన, జిగురు భావన కూడా తగ్గుతుంది. తేమను తగ్గించడంలో ముతక ఉప్పు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు లేదా ముతక ఉప్పును ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఉప్పు గిన్నెను కూలర్ దగ్గర, గది మూలల్లో, కిటికీ పక్కన లేదా బట్టలు ఉంచే అల్మారాల దగ్గర ఉంచితే మంచి ఫలితం ఉంటుందట. అయితే అది పడిపోకుండా జాగ్రత్తగా ఉంచాలి.

ఉప్పును ఉపయోగించే సరైన విధానం

దీనిని ఉపయోగించే సరైన విధానం కూడా చాలా ముఖ్యం. ఒక వెడల్పాటి గాజు లేదా ప్లాస్టిక్ గిన్నెలో ముతక ఉప్పు నింపి గదిలో ఉంచాలి. ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి ఉప్పును పరిశీలించి, అది పూర్తిగా తడిగా మారితే కొత్త ఉప్పును మార్చాలి. అయితే గోడలలో లీకేజీలు, అధిక తేమ లేదా నీరు ఇంకడం వంటి పెద్ద సమస్యలు ఉంటే కేవలం ఉప్పు మాత్రమే సరిపోదు. కానీ తేలికపాటి తేమ, దుర్వాసన, జిగట వంటి సమస్యలకు ఇది చాలా సులభమైన, చవకైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.

Read Also: గులాబీ పెదవుల సీక్రెట్.. ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>