Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు ఎలక్షన్స్​: డీఎంకే కూటమికి ఎంఐఎం మద్దతు

కలం, వెబ్​ డెస్క్​ : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అధికారికంగా వెల్లడించారు.

ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లందరూ తమ అమూల్యమైన ఓటును డీఎంకే కూటమి అభ్యర్థులకే వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమిలోని అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించి, విజయం చేకూర్చాలని తమిళనాడు ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మద్దతు డీఎంకే కూటమికి మరింత బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>