కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ భారతదేశ సౌర్వభౌమత్వాన్ని ట్రంప్‌నకు కట్టబెట్టారని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విరుచుకపడ్డారు. “ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడికి థ్యాంక్యూ చెబుతున్నారు. భారత నౌకలపై దాడులు చేస్తూ భారతీయులను చంపుతున్నందుకా.. మీరు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశానికి అవమానకరం. మోదీ భారతీయుల గౌరవాన్ని అమెరికా అధ్యక్షుడికి తాకట్టు పెట్టేశారు. మనకు ఈ సమయంలో బలమైన ప్రధాని కావాలి. ట్రంప్‌నకు నచ్చినట్లుగా భారత్ ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు” అని కౌంటర్ ఇచ్చారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ‘సెటెబె’ వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర పోర్టులు, నౌకాయన మంత్రి సర్బానంద సోనోవాల్ వివరించారు.

