కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)నామినేషన్ తిరస్కరణతో రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్‌లు ఆయా స్థానాల్లో ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అఫిడవిట్‌లో క్రిమినల్ కేసులు, ఆస్తుల వివరాలు సక్రమంగా పొందుపర్చని కారణంగా మీనాక్షి నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించిన విషయం తెలిసిందే.
దీన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆర్వో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. మరోవైపు రేపు మధ్యప్రదేశ్‌లోని 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవనున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ జీతూ పట్వారి వెల్లడించారు.ఎమ్మెల్యేల రాజ్యాంగ హక్కులను బీజేపీ హరిస్తోందని జీతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి కలిగిన విఘాతంపై రాష్ట్రపతికి వివరించనున్నట్లు తెలిపారు.

