కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ధర్నాకు దిగారు. దీంతో ఆయన్ను వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తున్న సందర్భంగా పోలీసులతో ఆప్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగి అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అంతకుముందు కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన ఇంటి నుంచి జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాతో పాటు ఎంపీ సంజయ్ సింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మోదీ ఎందుకంత భయపడుతున్నారు. జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాల్సిందే. ఈ దేశ ప్రజల ఓట్లు తొలగించే అధికారం ఆయనకు లేదు’ అని సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు.
Also Read : కాఫీ షాప్‌లో సీఎం విజయ్, రాహుల్ సందడి!
Follow Us On: X(Twitter)

