కలం, మహబూబ్ నగర్ బ్యూరో : సుదీర్ఘ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆర్టీసీ సంస్థ గుర్తింపు ఎన్నికల్లో (RTC Election) ఏఐటీయూసీ అనుబంధం ఎంప్లాయిస్ యూనియన్ కూటమి అఖండ విజయం కార్మికోద్యమ విజయాలకు సంకేతాలు అని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC)రాష్ట్ర కార్యదర్శి ఎం.మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్ కూటమి విజయ దుందుభి నేపథ్యంలో శనివారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏఐటీయూసీ అనుబంధం తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో కార్మికులకు ఉద్యోగులకు మిఠాయిలు పంచి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏం.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో (RTC Election) కార్మిక హక్కుల ఎర్రజెండా పై కార్మికుల ఎంతో విశ్వాసంతో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్ కూటమికి భారీ మెజారిటీతో పట్టం కట్టిన ఆర్టీసీ కార్మిక వర్గానికి విప్లవ జేజేలు అని అన్నారు. కార్మిక వర్గ హక్కుల గొంతుకగా 100 ఏళ్లకు పైగా ఏఐటీయూసీ సుదీర్ఘ సమరాలు నడుపుతూ అనేక విజయాలు సాధించిందని అన్నారు. నల్ల బంగారు నేలపై సింగరేణి సంస్థ ఎన్నికల్లో ఏఐటియుసి గెలిచిందని ఇప్పుడు ఆర్టీసీలో కనీవినీ ఎరగని విజయ దుందుభినీ ఏఐటీయూసీ మోగించిందన అన్నారు.
తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC)రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ మాట్లాడుతూ ..ఆర్టీసీ గుర్తింపు సంఘం రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఏఐటియుసి ఎంప్లాయిస్ యూనియన్ బస్సు గుర్తుపై వేసిన కార్మికుల ప్రతి ఓటు కార్మిక పోరాటాలకు మరింత జవసత్వాల నింపేవిధంగా ఉన్నాయని అన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని ఓడించేందుకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు అధికార మదం భ్రమలు కల్పించిన ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం తగిన బుద్ధి చెప్పారని అన్నారు.ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం ఆర్టిసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మిక వర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మెడికల్ యూనియన్ నేతలు సత్యం, బి.చెన్నయ్య, గోపాల్ నాయక్, భీమయ్య, శంకర్ నాయక్, శేఖర్, యాదయ్య,బాలరాజ్, శ్రీనివాస్ రెడ్డి,నరేష్, మల్లమ్మ,సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Also Read : అమెరికా నుంచి వీడియో కాల్.. లైవ్లో పిండ ప్రదానం!
Follow Us On : WhatsApp

