అతిభారీ వర్షం.. కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు

కలం, వెబ్ డెస్క్ : అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh ) లో కురిసిన అతిభారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన అతి భారీ వర్షానికి కేయీ పన్యోర్ జిల్లాలోని యాజలి, పోసా ప్రాంతాల్ని వరద నీరు ముంచెత్తింది. వరద ఉధృతికి యాజలి, పోసా, యీయీ గ్రామాల్లోకి కొన్ని ఇండ్లు కొట్టుకుపోయాయి. వందలాది ఇండ్లు నీట మునిగాయి.

వరద ధాటికి పోసా సమీపంలోని నీప్కో ప్రాజెక్ట్ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ఈ వరద ఉధృతిలో పలువురు గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. దీంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అరుణాచల్ ప్రదేశ్ దిగువ ప్రాంతమైన అసోంలోనూ వరద ముప్పు పొంచి ఉందని సంకేతాలు అందడంతో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>