Mobile Popup Ad
Mobile Popup Ad

ముగిసిన చంద్రుడి యాత్ర.. భూమిని చేరిన వ్యోమగాములు

కలం, వెబ్​ డెస్క్​ : అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ నాసా (NASA) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-2 (Artemis II) ప్రయోగం దిగ్విజయంగా పూర్తయింది. చంద్రుడి చుట్టూ ప్రయాణాన్ని ముగించుకున్న ఆర్టెమిస్-2 క్యాప్సూల్ 10 రోజుల సుదీర్ఘ అంతరిక్షయానం తర్వాత ఈరోజు తెల్లవారుజామున క్షేమంగా భూమికి చేరుకుంది. ఉదయం 5.38 గంటల సమయంలో కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం, శాన్ డియాగో తీరంలో ఈ వ్యోమనౌక సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఈ చారిత్రాత్మక యాత్రలో పాల్గొన్న నలుగురు వ్యోమగాములు రీడ్ వైజమాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ సంపూర్ణ ఆరోగ్యంతో భూమికి తిరిగి వచ్చారు. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి విజయవంతంగా తిరిగి రావడం ద్వారా రాబోయే కాలంలో మానవుడు చంద్ర మండలంపై అడుగుపెట్టే ప్రక్రియకు ఈ మిషన్ పునాది వేసింది. అంతరిక్షంలో 10 రోజుల పాటు సాగిన వీరి ప్రయాణం విజయవంతం కావడంతో నాసా శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్ వ్యోమగాములను క్యాప్సూల్ నుంచి బయటకు తీసి తదుపరి పరీక్షల కోసం తరలించే ఏర్పాట్లు చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>