‘అర్న‌బ్’ దెబ్బ‌కు ఏడుగురు మృతి!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో అర్న‌బ్ తుఫాన్ (Arnab Cyclone) బీభ‌త్సం సృష్టిస్తోంది. తుఫాన్ ధాటికి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. తుఫాన్ తీవ్ర‌త‌తో విశాఖ‌లో ఇద్ద‌రు, అన‌కాప‌ల్లిలో ఒక‌రు, ప‌శ్చిమ గోదావ‌రిలో ఇద్ద‌రు, కోన‌సీమ‌లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

మ‌రోవైపు చాలామంది తుఫాన్ దెబ్బ‌కు నిరాశ్ర‌యుల‌య్యారు. వేలాది గ్రామాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా స్తంభించిపోయింది. కిలో మీట‌ర్ల మేర‌ రోడ్లు కొట్టుకుపోయాయి. భారీ ఈదురు గాలుల‌తో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తోంది. వంద‌లాది భారీ వృక్షాలు, కొబ్బ‌రి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల‌కొరిగాయి. రోడ్ల‌పై చెట్లు విరిగిప‌డ‌టంతో రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంది. వేలాది ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.

తీర ప్రాంతాల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే వేలాది మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. తుఫాన్ (Arnab Cyclone) ప్ర‌భావిత ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు కూడా దెబ్బ‌తిన్నాయి. అలాగే శంషాబాద్ నుంచి, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, విశాఖప‌ట్నం వెళ్లాల్సిన 12 విమానాలు ర‌ద్ద‌య్యాయి. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే సైతం ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది.

Also Read : స్పెయిన్​లో ఘోర రైలు ప్రమాదం.. 46 మంది మృతి..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>