కలం, నిజామాబాద్ బ్యూరో: దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల (Firecracker) దుకాణాలు నెలకొల్పేవారు సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. ఎవరైనా సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు – 1884 రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టపాకాయల దుకాణాదారులు తప్పకుండా తాము సూచించిన నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
సీపీ సూచించిన నిబంధనలివే..
– టపాకాయల దుకాణాలు వారికి సంబంధించిన ఖాళీ ప్రదేశాల్లోనే నెలకొల్పాలి. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికెట్ పొందుపర్చాలి.
– ఒక క్లస్టర్‌లో 50 షాపులకు మించరాదు
– జన సంచారం గల ప్రదేశాల్లో ఎలాంటి టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదు. అదే విధంగా కళ్యాణ మండపాలలో, సమావేశాల కేంద్రాల్లో దుకాణాలు నెలకొల్పరాదు.
– తాత్కాలిక టపాకాయల దుకాణాల్లో ఫైర్‌కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
– పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ఫారంను సంబంధిత ఏసీపీ ఆఫీస్‌లో ఇవ్వాలి.

