కలం, వనపర్తి: వనపర్తి నియోజకవర్గ పరిధిలోని నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, పునరావాసం, పునరుద్ధరణ (ఆర్‌అండ్‌ఆర్) పరిహారం కింద రూ.33 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని అర్హులైన రైతులు, ఇతర లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) వెల్లడించారు. పరిహారం విడుదలకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, అర్హులకు పరిహారం అందించడం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. పరిహారం విడుదలతో సంబంధిత రైతులు, లబ్ధిదారులకు ఆర్థికంగా ఊరట లభించనుందని తెలిపారు.
Also Read : పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ అనుమానాస్పద మృతి!
Follow Us On : WhatsApp

