కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ సమీపంలో ఆర్మీ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది (Army Vehicle Overturn). ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా 14 మంది జవాన్లతో కూడిన వాహనం గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్‌లోని శిక్షణ కేంద్రానికి బయల్దేరింది. మార్గమధ్యంలో అల్లావాడ సమీపానికి చేరుకోగానే వాహనం అదుపుతప్పి పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న చెట్టును ఢీకొని ఆగింది.
ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 8 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను అంబులెన్స్‌లలో చికిత్స నిమిత్తం గోల్కొండలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో శిక్షణలో ఉన్న ఓ జవాను వాహనాన్ని నడుపుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

