Mobile Popup Ad
Mobile Popup Ad

వివాహేతర సంబంధం.. ఆర్మీ ఉద్యోగి హత్య

కలం, మెదక్ బ్యూరో: మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనిలో ఆర్మీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం కారణంగా పొన్నం కుమార్ ను భార్య, అత్తమామ, బావమరిది హత్య చేశారు. ఇంట్లో ఇద్దరు మహిళలతో ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా భార్య, అత్తమామ, బావమరిది పట్టుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురై పొన్నం కుమార్ ను కొట్టి హత్య (Army Subedar Murder) చేశారు. అనంతరం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిందితులు లొంగిపోయారు. ఉత్తరాఖండ్ లో ఆర్మీలో సుబేదార్ హోదాలో కుమార్ పని చేస్తున్నాడు. ప్రస్తుతం సెలవుల్లో మృతుడు కుమార్ ఉన్నాడు. ఈ నెల 10న విధులకు వెళ్లాల్సి ఉండగా హత్యకు గురయ్యాడు. నిందితులు నలుగురిని అరెస్టు చేసి, కేసు విచారణ చేస్తునట్టు పోలీసులు తెలిపారు.

Read Also: నీ సంగతి చూస్తా.. కిషన్​ రెడ్డికి సీఎం వార్నింగ్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>