కలం, స్పోర్ట్స్ : ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో యువ స్పిన్నర్ మనవ్ సుతార్ (Manav Suthar) తన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో రోజు 15.5 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి భారత ఆధిపత్యంలో కీలక పాత్ర పోషించాడు. సుతార్ ప్రదర్శనపై మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా ప్రశంసలు కురిపించాడు. చాలా కాలం తర్వాత నిజమైన ఆర్థోడాక్స్ ఎడమచేతి స్పిన్నర్‌ను చూసిన భావన కలిగిందని చెప్పాడు. ఇండెక్స్ ఫింగర్‌ను సమర్థంగా ఉపయోగిస్తూ బంతికి మంచి స్పిన్, టర్న్ అందించాడని పేర్కొన్నాడు.
ఇతర స్పిన్నర్లతో పోలిస్తే సుతార్ (Manav Suthar) బంతిపై ఎక్కువ రివల్యూషన్స్ సృష్టించాడని, అందుకే అతడి బౌలింగ్ మరింత ప్రభావవంతంగా కనిపించిందని చావ్లా విశ్లేషించాడు. అతడి బౌలింగ్ చూడటం ఆనందంగా అనిపించిందని తెలిపాడు. మాజీ భారత ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్ కూడా సుతార్‌ను కొనియాడాడు. ఒకే ప్రాంతంలో వరుసగా బంతులు వేయగల సామర్థ్యం అతడి ప్రత్యేకత అని పేర్కొన్నాడు. సుతార్ వేసిన బంతుల్లో 81 శాతం దాదాపు ఒకే స్పాట్‌లో పడటం అతడి క్రమశిక్షణకు నిదర్శనమని చెప్పాడు.
పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోయినా సుతార్ బంతులు టర్న్ అయ్యాయని నాయర్ గుర్తుచేశాడు. స్పిన్‌కు అనుకూలమైన వికెట్‌పై అయితే అతడిని ఎదుర్కోవడం బ్యాటర్లకు మరింత కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో సుతార్ అబ్దుల్ మాలిక్, రహ్మనుల్లా గుర్బాజ్, అఫ్సర్ జజాయ్ వికెట్లు తీశాడు. రెండో రోజు భారత స్పిన్నర్లలో వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు.
Read Also: లడఖ్‌లో హైదరాబాద్ యువకుడి పర్వతారోహణ.. డీజీపీ ఫోటోతో ఎమోషనల్ పోస్ట్!
Follow Us On : WhatsApp

