రేసింగ్‌లో భారత్ మార్క్.. వెర్‌స్టాపెన్‌నే వెనక్కి నెట్టిన అర్జున్ మైనీ..

కలం, వెబ్ డెస్క్:  అంతర్జాతీయ రేసింగ్ ట్రాక్‌పై భారత రేసర్ అర్జున్ మైనీ అద్భుతం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ‘నుర్బర్గ్ రింగ్ 24 అవర్స్’ క్వాలిఫైయింగ్‌లో నాలుగు సార్లు ఎఫ్1 ఛాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్‌ను వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. జర్మనీలోని టఫ్ఫెస్ట్ నుర్బర్గ్ రింగ్ ట్రాక్‌పై జరిగిన రెండో క్వాలిఫైయింగ్ సెషన్‌లో అర్జున్ మైనీ తన సత్తా చాటారు. హెచ్‌ఆర్టీ (HRT) బృందం తరఫున ఫోర్డ్ మస్టాంగ్ GT3 కారును నడిపిన అర్జున్.. నిర్ణీత ల్యాప్‌ను 8 నిమిషాల 11.278 సెకన్లలోనే పూర్తి చేశారు. ఇదే రేసులో పాల్గొన్న దిగ్గజ రేసర్ మాక్స్ వెర్‌స్టాపెన్ అర్జున్ కంటే వెనుకబడి ఐదో స్థానానికి పరిమితం కాగా, అర్జున్ నాలుగో స్థానంలో నిలిచారు. దాదాపు 161 కార్లు పాల్గొన్న ఈ భారీ పోటీలో అర్జున్ సాధించిన ఫలితం భారత రేసింగ్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.

ఈ ఘనతపై అర్జున్ స్పందిస్తూ.. ఇంతటి అత్యున్నత స్థాయి పోటీలో దిగ్గజ రేసర్లను దాటి ముందు వరుసలో నిలవడం చాలా సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. కొత్త ఫోర్డ్ మస్టాంగ్ కారుతో ఈ ప్రయాణం ఒక సవాలుగా అనిపించినా, టీమ్ సహకారంతో కారు అద్భుతమైన వేగాన్ని అందించిందని ఆయన పేర్కొన్నారు. రేసు ప్రారంభానికి ముందు ఈ ఫలితం తమ బృందంలో ఎంతో ధీమాను నింపిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అర్జున్ మైనీ తన సహచరులు ఫాబియో షెరెర్, డేవిడ్ షూమేకర్, ఫ్రాంక్ స్టిప్లర్‌లతో కలిసి ఈ ఎండ్యూరెన్స్ రేసులో పాల్గొంటున్నారు. వారాంతంలో జరగనున్న ప్రధాన రేసులో కూడా ఇదే వేగాన్ని కొనసాగించి చరిత్ర సృష్టించాలని అర్జున్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>