కలం, వెబ్ డెస్క్ : ఏపీఎస్ఆర్టీసీలో (APSRTC) ప్రైవేట్ సంస్థల ద్వారా విద్యుత్ బస్సులను నడిపించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే విరమించుకోవాలని జూన్ 8న ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ (JAC) సమావేశానికి పిలుపునిచ్చింది. ఉద్యోగుల హక్కులు, సంస్థ పరీరక్షణ కోసం నిర్వహించే ఈ భేటీలో ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణపై తాడోపేడో తేల్చుకునే పనిలో ఉన్నాయి.
ఈ క్రమంలోనే జూన్ 8న కార్యచరణ ప్రకటిస్తామని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ తేల్చి చెప్పింది. జూన్ 8 న విజయవాడలో ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం కాకముందు ఉన్న అన్ని ఉద్యోగసంఘాలు / అసోసియేషన్స్ తో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు దీర్ఘకాలికంగా ఆర్టీసీలో ఉన్న సమస్యలు,స్త్రీ శక్తి పథకం వల్ల ఇబ్బందులపై ఆర్టీసీలో ఉద్యోగులంతా ఏకమవుతున్నామని పేర్కొంది. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే నడపాలని డిమాండ్ చేసింది. డిపో స్థలాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

