Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతికి మారిటైమ్ బోర్డు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సముద్ర రంగానికి సంబంధించిన ప్రధాన సంస్థ అయిన ఏపీ మారిటైమ్ బోర్డు (APMB)ను విశాఖపట్నం నుంచి అమరావతికి తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 17 విడుదల చేసింది.

ప్రస్తుతం విశాఖలో కొనసాగుతున్న ఏపీఎంబీ కార్యకలాపాలు ఇకపై అమరావతి నుంచి నిర్వహించబడనున్నాయి. పరిపాలనా సమన్వయం మెరుగుపరచడం, నిర్ణయ ప్రక్రియ వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019లో అప్పటి ప్రభుత్వం ఏపీఎంబీని కాకినాడ నుంచి విశాఖపట్నానికి మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సంస్థను అమరావతికి తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>