Mobile Popup Ad
Mobile Popup Ad

ఆన్‌లైన్ హాజరుకు నో.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు కీలక ఆదేశం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో సంచలనంగా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తొలి విచారణకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌కు (Allu Arjun) కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్న కారణంగా ఆన్‌లైన్ ద్వారా విచారణకు హాజరవుతానని అల్లు అర్జున్ కోర్టును అభ్యర్థించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. కేసు ప్రాముఖ్యత దృష్ట్యా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ సోమవారం నాంపల్లి కోర్టులో(Nampally Court) ప్రత్యక్షంగా హాజరుకానున్నారు. ఈ కేసు ఇప్పటికే టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారగా, కోర్టు నిర్ణయంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>