కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఒక్కసారిగా వాతవరణం (AP Weather) మారింది. భానుడి భగభగలతో అల్లాడిపోయిన ప్రజలకు ఊరట కలిగిస్తూ రాష్ట్రంలో వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎండ ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు కాస్త ఊరట చెందారు.
ఇదిలాఉంటే ద్రోణి ప్రభావంతో కాసేపట్లో మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, మిగిలిన రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Read Also: కాక్రోచ్ జనతా పార్టీపై సుప్రీంకోర్టులో పిటిషన్
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

