Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో ఓటు ప్రక్షాళన: జులై 21 నుంచి SIR

కలం, వెబ్‌ డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. జులై 21వ తేదీ నుండి ప్రత్యేక సమగ్ర పునర్విచారణ (AP SIR) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం సుమారు మూడు నెలల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడం, కొత్త ఓటర్ల నమోదు లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

ఈ భారీ కసరత్తు నిర్వహణకు గాను ప్రత్యేకంగా బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO) నియామకం చేపడుతున్నారు. వీరికి జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు ఎస్ఐఆర్ విధివిధానాలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. 2002 నాటి నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>