కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 136వ “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో వీక్షించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించి, భారత సైనికుల ధైర్యసహసాలను ప్రధానమంత్రి కొనియాడారు. “ఆత్మనిర్బర్ భారత్” రక్షణ రంగం, గురించి మాట్లాడుతూ స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి, డిఆర్డిఓ అభివృద్ధి చేస్తున్న రక్షణ సాంకేతికతలను ప్రశంసించారు.
ముఖ్యంగా “క్యాచ్ ద రైన్”ఉద్యమం విజయవంతమైందని పేర్కొంటూ ప్రతి పౌరుడు వర్షపు నీటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అలాగే యువత విజయాల గురించి మాట్లాడుతూ.. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ గెలిచిన తెలుగు తేజం పి.వి సింధును అభినందించారు అలాగే యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలను ప్రశంసించారు. మణిపూర్ కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ రోనాల్డో లైషరామ్ అంతర్జాతీయ స్థాయిలో సాధించిన పరిశోధన విజయాన్ని ప్రస్తావించి అభినందించారు. స్థానిక కళలు సంస్కృతి పరిరక్షణ పై దృష్టి సారిస్తూ కాశ్మీర్ కు చెందిన సంప్రదాయ ” వాగూవ్” చాపల కలను, త్రిపురకు చెందిన చెంగ్ ప్రేంగ్ వాద్యాన్ని పెంచిన వారిని ప్రశంసిచారు.
పర్యావరణం విడుదల నిర్వహణ మహిళల సాధికారతకు సంబంధించిన పలు స్థానిక కార్యక్రమాలను ఉదాహరణలుగా ప్రస్తావించి దేశవ్యాప్తంగా జరుగుతున్న స్ఫూర్తిదాయక ప్రయత్నాలను ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ రాజకీయ కార్యక్రమం కాదని, దేశంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, జాతీయ విలువలు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి అనే అంశాలను ప్రజలకు చేరవేసే వేదిక అన్నారు. కార్గిల్ వీరుల త్యాగం నుంచి నీటి సంరక్షణ వరకు, స్వదేశీ రక్షణ సామర్థ్యం నుంచి యువత విజయాల వరకు ప్రతి అంశం దేశాన్ని మరింత బలోపేతం చేసే దిశలో ప్రజలను ప్రేరేపించే సందేశాన్ని ఇచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ప్రధాన కార్యదర్శి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత, యువ మోర్చా అధ్యక్షులు వంశీ, మైనార్టీ మోర్చా జస్పాల్ సింగ్, కార్పొరేటర్లు బెల్లాల్ శశాంక్, మఠం పవన్, జ్యోతి మురళి, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, మమత శివ, యువ మోర్చా రాష్ట్ర నాయకులు విజయ్, పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.

