కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చేందుకు, ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించేందుకు నేటి నుంచి ప్రత్యేక ఓటర్ డ్రైవ్ (AP Voter Drive) నిర్వహించనున్నారు. సర్వే ప్రకారం రాష్ట్రంలో దాదాపు 44.89 లక్షల మంది నివాస చిరునామాలో అందుబాటులో లేరని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ నేపథ్యంలో, పొరపాటున లేదా సాంకేతిక కారణాల వల్ల జాబితా నుంచి ఓటు హక్కు కోల్పోయిన అర్హులను పునరుద్ధరించేందుకు బిఎల్ఓలు (BLO) నేరుగా ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపడతారు. పరిశీలనలో ఒకవేళ అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించినట్లు తేలితే, వారికి బిఎల్ఓలు అక్కడికక్కడే ఫామ్-6 అందించి నమోదు ప్రక్రియ పూర్తి చేయిస్తారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ స్పెషల్ డ్రైవ్ అనంతరం, ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాను అధికారులు అధికారికంగా విడుదల చేయనున్నారు.

