కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలర్ట్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (RGUKT)పరిధిలోని నూజివీడు, ఆర్కేవ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటీఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు ఆయా క్యాంపస్‌లలో 4400 సీట్ల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
ఈ ఏడాది టెన్త్ పాసైన వారు దీనికి అర్హులు. ఈ నెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. https://www.rgukt.in/, ఏపీ ఆన్లైన్ మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల, మెరిట్ ఆధారంగా ట్రిపుల్ ఐటీ సీట్లు కేటాయించనున్నారు. జూన్ 12న లిస్టును విడుదల చేస్తారు. కౌన్సిలింగ్ అనంతరం జూలై ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.

