ఏపీలో తేలిన రాజ్యసభ సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్నంటే?

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఖాళీగా అయిన నాలుగు రాజ్యసభ సీట్ల (AP Rajya Sabha Seats) పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అమరావతి సీఎం క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఎన్టీయే నేతల భేటీ జరిగింది. ఈ భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ హాజరయ్యారు.

గంటన్నర పాటు సాగిన సమావేశంలో కూటమిలోని పార్టీల బలాబలాల ఆధారంగా రాజ్యసభ సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు ఒకటి, మిగిలిన మూడు సీట్లు టీడీపీకి కేటాయించాలని నిర్ణయించారు. బీజేపీకి సీట్లు కేటాయించలేదు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>