Mobile Popup Ad
Mobile Popup Ad

సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై పోలీసుల ఉక్కుపాదం

క‌లం, వెబ్ డెస్క్‌: సోషల్ మీడియాలో అభ్యంతకర, ఫేక్ పోస్టులపై ఏపీ పోలీసులు (AP Police) ఉక్కుపాదం మోపారు. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. ఊరుకోబోమని ఏపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను ఇబ్బంది పెట్టే, శాంతి భద్రతలకు భగ్నం కలిగించే చర్యలను.. తీవ్రంగా పరిగణిస్తామని డీజీపీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో.. చంద్రబాబు రక్తచరిత్ర అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్ CRPO శ్రీహరిపై చిత్తూరులో కేసు నమోదు కాగా.. పోలీసులు శ్రీహరిని అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై దూషణలు చేసిన.. రాప్తాడుకు చెందిన గిరీష్ రెడ్డిపై కుప్పం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. రాప్తాడులో గిరీష్ రెడ్డిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>