Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు (AP Municipal Workers) సమ్మె విరమణ చేశారు. మార్చి నెల జీతాలు ఇప్పటికీ అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకటించింది. దీంతో కూటమి ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. వారి మార్చి నెల జీతాలు చెల్లించింది. ఈ నేపథ్యంలోన మున్సిపల్ కార్మికులు తలపెట్టిన సమ్మెను విరమించారు.

అంతకుముందు మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునిస్తూ.. జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందారు. కొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. అంతేకాదు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, విధుల్లో ఉండగానే మరణించిన కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>