కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి (Ibomma Ravi ) తనకు ఎదురవుతున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులపై నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పోలీసుల విచారణ నేపథ్యంలో తన బ్యాంక్ ఖాతాలను పూర్తిస్థాయిలో ఫ్రీజ్ చేయడం వల్ల కుటుంబ పోషణ తీవ్ర భారంగా మారిందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
తన కుటుంబ అవసరాలు, నిత్యజీవితంలో రోజువారీ ఖర్చులు, అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం కనీసం కొన్ని బ్యాంక్ అకౌంట్లనైనా అన్‌ఫ్రీజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పోలీసుల చర్యలతో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నానని, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని రవి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపి కోర్టు తగిన నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.

