భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై క్రెడిట్ చోరీ.. బాధ కలిగింది: సజ్జల

కలం, వెబ్ డెస్క్ : నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala) అన్నారు. అయితే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై కూటమి నేతలు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై వాళ్లు చేసిన అబద్ధపు ప్రచారం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

భోగాపురం విమానాశ్రయానికి (Bhogapuram Airport) కొబ్బరికాయ కొట్టింది.. గుమ్మడికాయ కొట్టింది తానేనని చంద్రబాబు అంటున్నారని సజ్జల (Sajjala Ramakrishna Reddy) చెప్పుకొచ్చారు. అయితే జగన్ హయాంలోనే అన్ని అనుమతులు, పనులకు లైన్ క్లియర్ చేశామని వెల్లడించారు. జగన్ కార్యచరణతో ముందుకెళ్లిన ఈ ఎయిర్ పోర్టును చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు, అలాగే కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేయడమే కాదు.. విష ప్రచారం కూడా చేస్తుందన్నారు. ఎర్రబస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు ఎందుకు అని జగన్ అనలేని మాటను వక్రీకరించి కూటమి నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు మొదలు, పవన్ కళ్యాణ్, లోకేష్, రామ్మోహన్ నాయుడు ఇదే విష ప్రచారం చేశారని విమర్శలు గుప్పించారు.

Also Read : ప‌వ‌న్ భార్య దాతృత్వం.. బ‌ర్త్‌డే రోజు ఏం చేసిందంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>