కలం, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ (AP Education) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 6 జిల్లాలకు విద్యాశాఖాధికారులను (DEO) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, పశ్చిమగోదావరి, కోనసీమ, అనకాపల్లి జిల్లాలకు కొత్త డీఈవోలు నియామకమయ్యారు. ఆయా జిల్లాల్లో విద్యా పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త డీఈవోలను నియమించింది.
విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి..
జిల్లాల వారీగా విద్యా వ్యవస్థ పర్యవేక్షణ, స్కూళ్ల నిర్వహణ, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల అమలు, స్కూళ్లలో టీచర్ల విద్యా బోధన తనిఖీలు వంటి బాధ్యతలను కొత్తగా నియమితులైన అధికారులు చేపట్టనున్నారు. కొత్తగా నియమితులైన డీఈఓలు తమ జిల్లాల్లో విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని విద్యాశాఖ సూచించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, టీచర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించింది. తాజా నియామకాలతో ఆయా జిల్లాల్లో విద్యా పరిపాలన మరింత పటిష్టం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
డీఈఓలు వీరే..
అనంతపురం జిల్లా జిల్లా విద్యాశాఖాధికారిగా ఆయూబ్ హుస్సేన్‌ను నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డీఈవోగా భానుమూర్తిరాజును నియమించారు. ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారిగా సీవీ రేణుక నియమితులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా డీఈవోగా అనిల్‌కుమార్ నియమితులయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖాధికారిగా మహబూబ్ బాషాను నియమించారు. అనకాపల్లి జిల్లా డీఈవోగా నాగేశ్వరరావును నియమించారు.

