కలం, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో దీర్ఘకాలంగా ఆస్తి పన్ను (Property Tax) చెల్లించని గృహాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట (Kazipet) సర్కిల్లో పన్ను బకాయి ఉన్న ఓ ఇంటిని డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ శనివారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేపదే నోటీసులు ఇచ్చినా స్పందించని మొండి బకాయిదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

