కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా నేడు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ VS రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) తలపడనున్న ఈ కీలక పోరు ముల్లాన్‌పూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధించనుండగా, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. దీంతో ఇరు జట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ , రియాన్ పరాగ వంటి బ్యాటర్‌లు కీలకం కానుండగా.. గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
బౌలింగ్ విభాగంలో కూడా ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. ఆర్చర్, రవి బిష్ణోయ్ వంటి బౌలర్స్ రాజస్థాన్‌కు ప్రధాన ఆయుధాలుగా ఉండగా.. రషీద్ ఖాన్, సిరాజ్ గుజరాత్ విజయావకాశాలను పెంచుతున్నారు. ముల్లాన్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో మరో హై స్కోరింగ్ థ్రిల్లర్ చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్లేఆఫ్స్ ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ఫైనల్ బెర్త్ కోసం జరిగే ఈ సమరంలో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.

