వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు మండ‌లికే ప‌రిమిత‌మా?: ఏపీ బీజేపీ చీఫ్‌

క‌లం, వెబ్ డెస్క్‌: వైసీపీ (YCP) ప్ర‌జాప్ర‌తినిధులు కేవ‌లం శాస‌న‌మండ‌లికే ప‌రిమిత‌మా? అని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ (PVN Madhav) ప్ర‌శ్నించారు. అసెంబ్లీకి ఎందుకు రావ‌డం లేద‌ని నిల‌దీశారు. ఒక్క మ‌గాడు అంటూ సోష‌ల్ మీడియాలో ప్రచారం చేసుకునే వ్యక్తులు అసెంబ్లీకి వ‌చ్చి మాట్లాడాల‌ని స‌వాల్ విసిరారు. వైసీపీ స‌భ్యులు కేవ‌లం గంద‌ర‌గోళం సృష్టించేందుకే మండ‌లికి వ‌స్తున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో చ‌ర్చించేందుకు ఎన్నో అంశాలు ఉన్నాయ‌న్నారు. అన్నింటిపై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌ ఎన్నో పెట్టుబ‌డులు వస్తున్నాయ‌ని తెలిపారు. ఒక సంవత్స‌ర కాలంలో దేశంలోనే ఏ రాష్ట్రానికి రాన‌న్ని పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక 14 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. గొప్ప కంపెనీలు రాష్ట్రానికి రావ‌డం, స్థానికంగా ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డుతుంటే వైసీపీ నేత‌ల‌కు కంట‌గింపుగా ఉంద‌న్నారు. వైసీపీ నేత‌లు రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టిస్తూ, త‌మ‌పైనే దాడులు జ‌రిగిన‌ట్లు డ్రామాలు చేస్తున్నార‌ని మాధ‌వ్ (PVN Madhav) విమ‌ర్శించారు.

Read Also : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ !

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>