రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని మృతదేహం కలకలం

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం రైల్వే స్టేషన్‌ (Khammam)లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం ప్లాట్‌ఫామ్ పై ఓ వ్యక్తి పడి ఉండటం గమనించిన రైల్వే పోలీసులు, దగ్గరకు వెళ్లి పరిశీలించి అతను మరణించినట్లు ధ్రువీకరించారు. మృతదేహం తల కింద ఒక బ్యాగు, పక్కన మరో సంచి ఉండటంతో అతను ప్రయాణికుడు కావచ్చని పోలీసులు బావిస్తున్నారు.

అయితే ఇది సాధారణ మరణమా లేక హత్యనా అనేది తెలియాల్సి ఉంది. మృతుడి తలకు గాయం ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

Read Also : ఏపీ సీఎంను క‌లిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>