epaper
Monday, March 2, 2026
epaper

‘అన్నారం’లో ఇసుక అక్రమ రవాణా.. ప్రభుత్వం క్లారిటీ

కలం, డెస్క్ : అన్నారం బ్యారేజీలో (Annaram Barrage) ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. మిర్రర్ టీవీలో అలాగే బీఆర్ ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ లో అన్నారం బ్యారేజీలో ఇసుక అక్రమ రవాణా అంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా తప్పు అని స్పష్టం చేసింది ప్రభుత్వం. అన్నారం బ్యారేజీకి రిపేర్లు చేసేందుకు అధికారులే ఇసుకను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

అన్నారం బ్యారేజీ విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సుల మేరకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్, పుణే (CWPRS, Pune)ను నీటి పారుదల శాఖ అధికారులు సంప్రదించారు. అన్నారం బ్యారేజీకి అన్ని రకాల పరీక్షలు నిర్వహించే బాధ్యతను CWPRSకు అప్పగించామని.. ఆ పరీక్షలు చేయాలంటే బ్యారేజీ వద్ద నీరు, ఇసుక లేకుండా చూడాలని CWPRS సూచించిందని అధికారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం అన్నారం బ్యారేజ్ అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ ప్రాంతాల్లో భారీగా ఇసుక పేరుకుపోతుందని.. దాన్ని తొలగించేందుకు భూపాలపల్లి కలెక్టర్ పర్మిషన్ ఇస్తే.. టీజీఎండీసీ (TGMDC) మేనేజింగ్ డైరెక్టర్ ఒప్పందాన్ని కుదిర్చుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇలా ఒప్పందం చేసుకున్న ఏజెన్సీలు సాగునీటి శాఖ అధికారుల సమక్షంలోనే నిర్మాణం మీద ఉన్న ఇసుకను మాత్రమే తొలగిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఇసుక తొలగించడం వల్ల బ్యారేజీ నిర్మాణానికి ఎలాంటి నష్టం రాలేదని.. కానీ దాన్ని కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్నారం బ్యారేజీలో (Annaram Barrage) ఎలాంటి అక్రమ తవ్వకాలు జరపట్లేదని తెలిపింది.

Read Also: సీఎం వర్సెస్ సివిల్ సర్వెంట్స్.. ఆగ్రహం, అనుగ్రహం ఎవరిపై?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!