కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు అన్నామలై ప్రకటన

కలం, వెబ్ డెస్క్: బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై (Annamalai) కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త పార్టీ స్థాపించబోతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. త్వరలోనే ఉద్యమాన్ని ప్రారంభిస్తాం’ అని స్పష్టం చేశారు. బీజేపీకి రాజీనామా చేయడంపైనా స్పందించారు. ‘అసలు నేను బీజేపీ వ్యక్తినా.. తమిళుడినా.. అనే సందేహం వచ్చింది. గతేడాది డిసెంబర్ 4వ తేదీనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు కూడా చెప్పాను. అయితే, ఎన్నికలు ముగిసిన తరువాతనే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పడంతో ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది’ అని కుండబద్దలు కొట్టారు.

Read Also: రేవంత్ దేశంలోనే అత్యధిక కేసులున్న సీఎం: తాటికొండ రాజయ్య

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>