Mobile Popup Ad
Mobile Popup Ad

విశాఖలో 50 శాతం గ్రీనరీ పెంచేలా చర్యలు: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: పచ్చదనం, పర్యావరణానికి ఆంధ్రా యూనివర్సిటీ (AU) క్యాంపస్ ఆదర్శంగా మారాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆకాంక్షించారు. నెట్ జీరో క్యాంపస్ గా ఏయూను తీర్చిదిద్దాలని.. గ్రీనరీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీని ఆదేశించినట్లు తెలిపారు. ఎంతో విశిష్టమైన ప్రముఖులను ఏయూ తయారు చేసిందని కొనియాడారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా విశాఖ ఏయూ గ్రౌండ్స్ కు సీఎం చంద్రబాబు సైకిల్ పై చేరుకున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ యూనివర్సిటీలో మొక్కను నాటారు. ఇవాళ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన పెంచేందుకు తాను సైకిల్ మీదే ప్రయాణిస్తానని సీఎం తెలిపారు. మొక్కలు బాగా పెంచిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లంటూ సీఎం సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సీఎం మాట్లాడుతూ.. విశాఖలో 50 శాతం గ్రీనరీ (Visakhapatnam Greenery) పెంచేలా చర్యలు చేపడతున్నామని వివరించారు. విశాఖ ఏయూలో మాత్రం కేవలం 25 శాతం మాత్రమే గ్రీనరీ ఉందని తెలిపారు. విశాఖలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పోర్టు దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్లోనూ చర్యలు తీసుకుంటామన్నారు. సైకిలింగ్ అనేది జీవన విధానం కావాలని సూచించారు. విశాఖలో ప్రత్యేకంగా సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 5 కోట్ల సీడ్ బాల్స్‌తో గ్రీనరీ పెంచేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. తిరుమలలో గ్రీనరీ త్వరలో 90 శాతానికి చేరుకోబోతోందన్న ముఖ్యమంత్రి తెలిపారు.

ఎండలు విపరీతంగా పెరిగాయని.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓవైపు విపరీతమైన ఎండలు.. లేకుంటే తుఫానులు వస్తున్నాయని అన్నారు. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవాలని.. ఏయూకు 450 ఎకరాల ల్యాండ్ ఉందని చెప్పారు. ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెట్టాలని… బిల్డింగులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏయూ గ్రౌండ్స్ నుంచి బీచ్ రోడ్డులోని నోవోటెల్ వరకు సైకిల్ పై ముఖ్యమంత్రి ప్రయాణించారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21:18 నిమిషాల్లో చేరుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>