అనిరుధ్‌, కావ్యామార‌న్ పెళ్లి డేట్‌ ఫిక్స్‌..!

క‌లం, వెబ్‌డెస్క్‌: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ యజమాని కావ్య మారన్ (Kavya Maran), ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ (Anirudh Ravichander) వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నవంబర్ 10న గ్రీస్‌లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌ మేనమామ, నటుడు మహేంద్రన్ ఇటీవల వీరిద్దరి మధ్య ఉన్న రిలేష‌న్‌ను బ‌య‌ట‌పెట్టిన‌ట్లు ప‌లు క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మ‌రోవైపు కేవ‌లం అతికొద్ది మంది స్నేహితులు, కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య వీరి పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు రూమ‌ర్లు వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>