కలం, వెబ్ డెస్క్ : పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయా రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది. రాబోయే ఎన్నికల్ల గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) స్క్రీనింగ్ కమిటీలను నియమించింది. అందులో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కమిటీలో తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) కు అవకాశం లభించింది.
ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. కాగా.. కేరళ, అస్సాం, తమిళనాడు, పాండిచెర్రి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ స్క్రీనింగ్ కమిటీలను నియమించింది.
Read Also: భోగాపురం ఎయిర్ పోర్టు ట్రయల్ రన్ కు రెడీ..
Follow Us On : WhatsApp


