epaper
Sunday, March 1, 2026
epaper

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను కలిసిన మంత్రి లోకేశ్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ముంబై పర్యటనలో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ (Sanjay Dutt) ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు లోకేశ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపట్టే ప్రణాళికలపై సంజయ్ దత్‌తో చర్చించినట్లు తెలిపారు.

రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ షూటింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆధునిక సదుపాయాలతో ఫిల్మ్ సిటీ (Film City) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, సినిమా షూటింగ్స్‌కు అనుమతులు త్వరగా లభించేలా సింగిల్ విండో అప్రూవల్ ప్రాసెస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దీంతో నిర్మాతలు, దర్శకులు సులభంగా అనుమతులు పొందగలరని, రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమ అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!