వరంగల్‌లో అనధికార ఫ్లెక్సీలపై ఉక్కుపాదం.. GWMC ప్రత్యేక డ్రైవ్

కలం, హనుమకొండ: గ్రేటర్ వరంగల్‌లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్‌బోర్డుల తొలగింపునకు జీడబ్ల్యూఎంసీ (GWMC) నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ (Special Drive) చేపట్టింది. గురువారం టౌన్ ప్లానింగ్, డీఆర్‌ఎఫ్ బృందాలు అంబేద్కర్ సర్కిల్, మిషన్ హాస్పిటల్, సర్క్యూట్ గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో అనధికార ఫ్లెక్సీలను తొలగించాయి.

జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ.. మొదటి విడతలో వారం రోజుల్లో నగరంలోని అన్ని అనధికార ఫ్లెక్సీలు, బిల్‌బోర్డులను తొలగిస్తామని, రెండో విడతలో ప్రభుత్వ భవనాలపై ఉన్న వాల్ రైటింగ్స్, పోస్టర్లను తొలగించి ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్‌లు వేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రచార బోర్డులు ఏర్పాటు చేసిన వారిపై భారీ జరిమానాలతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర సౌందర్య పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>