కలం, సినిమా : సీనియర్ నటుడు శివాజీ (Shivaji) ఇటీవల ఆడవారి వస్త్రాధారణ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నటి అనసూయ (Anasuya) “నా బాడీ నా ఇష్టం ” అంటూ చేసిన పోస్ట్ తో ఈ వివాదం పెద్దదిగా మారింది. దీనితో శివాజినే ఏకంగా మహిళా కమీషన్ ముందు క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. అయితే శివాజీ క్షమాపణలు చెప్పినా కానీ ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది. చాలా మంది సెలెబ్రెటీలు ఇటు శివాజీకి మద్దతుగా, అటు అనసూయకు మద్దతుగా పోస్ట్లు పెడుతున్నారు. నెటిజెన్స్ సైతం ఈ విషయంపై భిన్నంగా స్పందిస్తున్నారు. తాజాగా ఓ నెటిజెన్ ఈ విషయం గురించి అనసూయను ప్రశ్నించగా.. ఆమె ఈ విధంగా స్పందించారు.
నటుడు శివాజీ మంచి విషయమే చెప్పారు. కానీ ఆ రెండు పదాలు వాడకుంటే బాగుండేదనీ ఆమె అన్నారు. శివాజీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే పాత్రల స్వభావం సినిమా వరకే ఉండాలి. ఆయన ఆడవాళ్ళ సేఫ్టీ గురించి చెప్పిన మాటల్లో మంచి ఉద్డేశం ఉంది. కొంతమంది వెధవల నుండి మనమే అమ్మాయిలను కాపాడుకుందాం అని అబ్బాయిలకు కూడా చెప్పి ఉండాల్సింది అని అనసూయ పేర్కొన్నారు.


