కలం, వెబ్ డెస్క్: వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఏపీలోని రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు అనంతబాబు (Anantha Babu) బెయిల్ రద్దుపై తీర్పును ఈ నెల 13కు వాయిదా వేసింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబు జైళ్లో ఉన్నారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య ప్రధాన నిందితులుగా ఉండటంతో అనంతబాబును గతంలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొన్ని రిమాండ్ల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు అయింది. దీంతో అనంతబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే ఈ కేసుకు సంబంధించిన సాక్షులను అనంతబాబుతో పాటు ఆయన అనుచరులు బెదిరించారని పేర్కొంటూ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
బాధితుల ఫిర్యాదుతో అనంతబాబుపై కేసు సైతం నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. ఈ నిందితుడిగా ఉన్న అనంతబాబు బెయిల్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు పెరగటంతో రాజమండ్రి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై తీర్పు పలుమార్లు వాయిదా పడగా.. తాజాగా మరోసారి తీర్పు వాయిదా పడింది.

